రోబో 2.0 సినిమా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా వివిధ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. అయితే రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ, ఫ్యాన్స్‌తో వరుస భేటీలన్నీ రోబో2 పబ్లిసిటీకి తప్ప వేరొకటి కాదని కోలీవుడ్‌లో టాక్ వస్తోంది. రజనీ ఎన్నో ఆశలతో చేసిన 'కబాలి' సినిమా అట్టర్ ప్లాపై పోవడంతో రోబో2 సినిమా రిలీజ్ కోసం రజనీకాంత్ కొత్త డ్రామాకి తెరతీశాడని టాక్ వస్తోంది.
వాస్తవానికి రజనీకాంత్‌కు పొలిటికల్ స్టామినాలేనప్పటికీ పొలిటికల్ డ్రామా క్రియేట్ చేసి సినిమాకోసం పాట్లు పడుతున్నాడని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. నిన్నటి వరకూ ఫ్యాన్స్‌తో జరిపిన భేటీల్లో రజనీకాంత్.. కొంతసేపు రాజకీయాలకు దూరం అని.. అంతలోనే దేవుడు ఆదేశిస్తాడు.. నేను ఆచరిస్తాను అంటూ.. ఇలా డొంకతిరుగుడు సమాధానాలే తప్ప స్ట్రయిట్‌గా ఒక్క మాటకూడా చెప్పలేదని వారు చెప్తున్నారు. ఇదంతా రాజకీయాల్లో ఆయన అరంగేట్రానికి రాడని చెప్పేందుకు నిదర్శనమని సినీ జనం అంటున్నారు.