అలాగే, హైదరాబాద్‌లో తాను ప్రారంభించిన ఎఫ్-45 జిమ్ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నది. మార్చిలో విశాఖపట్నంలో మరో బ్రాంచిని నెలకొల్పనున్నాం. అందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. జిమ్ వ్యవహారాల్ని నా తమ్ముడు పర్యవేక్షిస్తున్నాడు. వాడికి సినిమాల్లోకి రావాలని వుంది. అతడి అభిమతం మేరకు నేను కూడా ప్రోత్సహిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ప్రేక్షకుల్ని మెప్పించడం మామూలు విషయం కాదన్నారు. అందుకు ఎంతో పరిణితి కావాలి. నేను పరిశ్రమలోకి వచ్చి నాలుగేళ్లే అవుతుంది. కాబట్టి పూర్తిస్థాయి కథానాయిక ప్రాధాన్యత వున్న చిత్రంలో నటించే స్థాయికి ఇంకా చేరుకోలేదనుకుంటున్నాను. ప్రస్తుతం నయనతార ఆ తరహా చిత్రాల్లో నటిస్తోంది. ఆమెకు అంతటి స్టార్‌డమ్ వుందన్నారు.
సాయిధరమ్ తేజ్‌తో కలిసి విన్నర్ చిత్రంలో నటించడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. తాను పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో పరిచయమైన స్నేహితుల్లో సాయిధరమ్‌తేజ్ ఒకరు. రాశిఖన్నా, రెజీనా, సందీప్ కిషన్ మేమంతా ఓ బ్యాచ్‌లా ఉండేవాళ్లం. అందుకే సాయిధరమ్‌తేజ్‌తో సినిమా అనగానే ఓ ఫ్రెండ్‌తో కలిసి పనిచేస్తున్నాననే భావన కలిగిందన్నారు.