సమంత వద్దు డాడీ.. రకుల్ ప్రీత్ బాగుంటుంది.. నాగ చైతన్య సిఫార్సు.. ఒకే చెప్పిన మన్మథుడు!

శుక్రవారం, 15 జులై 2016 (13:14 IST)
టాలీవుడ్ హీరో నాగార్జున కుమారుడు నాగ చైతన్య, హీరోయిన సమంతల వివాహంపై రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్‌లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ కథతో చైతు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
 
ఈ చిత్రంలో తొలుత సమంతను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే తాజాగా సమంత స్థానంలో రకుల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సమ్మూ-చైతూ రిలేషన్‌పై రోజుకో వార్త వస్తుండడంతోనే హీరోయిన్‌ను మార్చినట్లు ఫిలింనగర్ టాక్ వినిపిస్తోంది. 
 
ఈ చిత్రానికి నాగార్జునను 'సోగ్గాడు'గా చూపించి బంపర్ హిట్టు కొట్టిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. తన తొలి సినిమాతోనే మంచిపేరు తెచ్చుకున్న కల్యాణ్ కృష్ణ ఇప్పుడు నాగ చైతన్యను సరికొత్త కోణంలో చూపించేందుకు సిద్ధమయ్యాడు. 

వెబ్దునియా పై చదవండి