రాంచరణ్ తండ్రికాబోతున్నాడా? అవన్నీ ఉత్తుత్తి పుకార్లే....

బుధవారం, 22 మార్చి 2017 (09:58 IST)
మెగాపవర్ స్టార్ రాంచరణ్ తండ్రికాబోతున్నట్టు వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ వార్తలన్నీ ఉత్తుత్తి పుకార్లేనని తేలిపోయింది. ఈ విషయంపై రాంచరణ్‌కు అత్యంత సన్నిహితడు ఒకరు స్పందిస్తూ... చెర్రీ తండ్రి కాబోతున్నట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 
 
కాగా, 2012 జూన్ నెలలో అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహించనున్న సినిమాపై రామ్ చరణ్ దృష్టి సారించాడు. 

వెబ్దునియా పై చదవండి