పెద్ద నోట్ల రద్దు: జయమ్ము నిశ్చయమ్మురా హిట్ వెనుక వర్మ బ్యాచ్ ఉందా?

ఆదివారం, 27 నవంబరు 2016 (17:29 IST)
పెద్ద నోట్ల రద్దుతో టాలీవుడ్‌ కలెక్షన్లపై ప్రభావం పడింది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డి హీరోగా రిలీజైన "జయమ్ము నిశ్చయమ్మురా" మూవీ వెనుక పెద్ద హ్యాండే ఉందంటున్నారు. సినిమా పబ్లిసిటిలో కొత్తపోకడలు, మూవీ రిలీజ్‌కుముందే ప్రీమియర్ షోలు, సినిమాపై సోషల్ మీడియాలో కామెంట్లు, రివ్యూలు పోటెత్తించడం వెనుక పెద్ద స్ట్రాటజికల్ మైండ్ సలహాలున్నాయని టాక్. 
 
ఈ సినిమా సక్సెస్ సాధించేందుకు ప్రముఖ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ బ్యాచ్ మూవీ ఉందని వాదిస్తున్నారట. అసలేంటి కథ అని తీగె లాగితే.. వర్మ బ్యాచ్, జెడి చక్రవర్తి ఆఫీసులోని డొంక కదిలింది. సినిమా గురించి హీరోయిన్ పూర్ణ ఇదే ఆఫీస్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి విశేషాలు చెప్పడం, మీడియా ఇంటర్యూలు తదితర కార్యక్రమాలన్నీ కూడా జెడి చక్రవర్తి ఆఫీస్‌లోనే జరగడం.. మూవీ డైరెక్టర్ శివరాజ్ కనుమూరి కూడా వర్మ దగ్గర శిష్యరికం చేసిన సంగతిని కొంతమంది గుర్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి