రష్మిక మందన్నా గుండు కొట్టేసింది.. ఫోటోలు వైరల్

శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (17:27 IST)
Rashmika Mandanna
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గుండుతో ఉన్న ఫోటోలు గత రెండు రోజులుగా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రష్మిక డై హార్ట్ ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. తమిళనాడులోని కొన్ని సెలూన్‌ బోర్డులపై ప్రస్తుతం గుండుతో ఉన్న రష్మిక ఫోటోలు దర్శనమిస్తున్నాయి. 
 
తమ వ్యాపారం కోసం కొంతమంది ఇలా రష్మిక ఫోటోను వాడేశారని తెలిసి ఆమె ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్న ఇతర కథానాయికల ఫ్యాన్స్ పేజీలకు వార్నింగ్ ఇస్తున్నారు రష్మిక ఫ్యాన్స్. అంతేకాదు, వారి అభిమానించే హీరోయిన్స్ ఫోటోలను కూడా ఎడిట్ చేస్తూ.. మీమ్స్‌ సృష్టిస్తూ షేర్ చేస్తున్నారు. దీంతో రష్మిక గుండు వివాదం సోషల్ మీడియాలో రచ్చ.. రచ్చగా మారింది.
 
ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ- రష్మిక జోడీ గురించిన కొన్ని ఊహాగానాలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. వీళ్ళ మధ్య ఏదో రిలేషన్ కొనసాగుతుందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక రీసెంట్‌గా మరోసారి ముంబైలోని ఓ రెస్టారెంట్ స్పాట్ వద్ద ఈ ఇద్దరూ కెమెరాకు చిక్కడం, పైగా రష్మిక చేతిలో ఫ్లవర్ బొకే ఉండటంతో ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ వీడియోతో దీని గురించిన క్లారిటీ వచ్చేసింది.
 
విజయ్ దేవరకొండ- రష్మిక జోడీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా వాళ్ళతో ఓ కమర్షియల్ యాడ్ షూట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో జరిగింది. త్వరలో టెలికాస్ట్ కాబోయే ఈ కమర్షియల్ యాడ్‌‌కి సంబంధించి చిన్న వీడియో క్లిప్ బయటకొచ్చింది.

ఇందులో విజయ్ దేవరకొండ రష్మికకు ఓ గిఫ్ట్ ఇస్తూ మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేయడం కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసి ఇరువురి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అలా మొత్తానికి ముంబైలో విజయ్ దేవరకొండ- రష్మికల సీక్రెట్ మీట్‌పై ఓ క్లారిటీ అయితే వచ్చిందనే చెప్పుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు