నీతులు చెప్పే హీరోలంతా.. హీరోయిన్లు పక్కలోకి రాలేదని అలా చేసినవారే (Video)

సోమవారం, 20 జులై 2020 (09:09 IST)
సినీ ఇండస్ట్రీలో చీకటి బాగోతాలపై సినీ హీరోయిన్లు, వర్థమాన నటీమణులు అప్పుడపుడూ నోరు తెరుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా, క్యాస్టింగ్ కౌచ్‌ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇపుడు బంధుప్రీతి అంశం తెరపైకి వచ్చింది. ఈ కారణంగానే బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారంటూ అనేక మంది బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆరోపిస్తున్నారు. అలాగే, గతంలో అనేక మంది హీరోయిన్లు కూడా తాము తెరవెనుక లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చారు. 
 
ఇపుడు బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా మరో అడుగు ముందుకేసి... సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆమె తన బ్లాగులో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇండస్ట్రీలో బంధుప్రీతి గురించి చాలా మంది మాట్లాడుతున్నారని... లోపలివాళ్లు, బయటివాళ్లు అంటున్నారని... ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన కొందరు పక్క వారికి చిన్న సహాయం కూడా చేయరని రిచా తెలిపింది. 
 
బాలీవుడ్‌లో రెండు రకాల మనుషులు ఉన్నారని... జాలి, దయ ఉన్నవాళ్లు... లేని వాళ్లు అని చెప్పింది. సుశాంత్ చనిపోయిన తర్వాత చాలా మంది దర్శకులు నీతి వాక్యాలు చెప్పారని... వారిలో చాలా మంది హీరోయిన్లు తమ గదికి రాలేదని వారిని సినిమాల నుంచి తొలగించినవాళ్లేనని సంచలన వ్యాఖ్యలు చేసింది.
 
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ చీకటి కోణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో, పలువురు సినీ ప్రముఖులు ఇండస్ట్రీలో జరిగే దారుణాలపై మాట్లాడుతున్న సమయంలో సుశాంత్ స్నేహితురాలుగా ఉన్న రిచా చద్దా చేసిన తాజా వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు