ఫిదా భామ సాయిపల్లవికి బంపర్ ఆఫర్ వచ్చేసింది. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో నటించే సాయిపల్లవి.. రణ్‌బీర్‌తో స్క్రీన్‌ను పంచుకోనుంది. మధు మంతెన తదుపరి రామాయణంలో సాయిపల్లవి, రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 2023లో ప్రారంభం కానుంది.
కాగా టాలీవుడ్లో, సాయి పల్లవి చివరిసారిగా మహిళా సెంట్రిక్ మూవీ గార్గిలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా ఆడింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమైన సాయి పల్లవి సొంతంగా హాస్పిటల్ నిర్మించుకోవడంపై దృష్టిపెట్టిందని తెలుస్తోంది.