బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ 'సుల్తాన్' చిత్రం రికార్డుల మోత మోగిస్తుంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సల్మాన్ మేనియానే కనిపిస్తుంది. ఈ సినిమాలో సల్లూభాయ్ సరసన అనుష్క శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో అనుష్క శర్మ ఓ రెజ్లర్ పాత్రను పోషించింది. సల్మాన్ ఖాన్ సినిమాలు ప్రపంచ స్థాయిలో ఏ విధంగా ఆడతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
ఇప్పటివరకు తొలిరోజు అంటే బుధవారం ఓవర్‌సీస్‌లో 92 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. భారత్‌లోనే ఐదు రోజులకు 252.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ.344.5 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు సినీపండితులు అంటున్నారు. ఈ సినిమా దుబాయ్, పాకిస్థాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి చాలా దేశాల్లో ఇప్పటివరకు ఏ హిందీ సినిమాకూ రానంత స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో జంగిల్ బుక్ (183.94), ఎయిర్‌లిఫ్ట్ (127.8) పూర్తి వసూళ్ళను సల్లూభాయ్ చిత్రం వారం రోజుల్లోనే కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టిస్తోంది.