టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగచైతన్యతో మూడుముళ్ల బంధాన్ని తెగదెంపులు చేసుకున్న హీరోయిన్ సమంత ఇపుడు మరింతగా స్వేచ్ఛగా నటిస్తున్నారు. ఆమె రూటు మార్చి పాత పంథాలో పయనిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆమె ఐటమ్ సాంగ్లో నర్తించనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది.
అయితే, చైతూతో వివాహానికి ముందు పలు సినిమాల్లో సమంత గ్లామరస్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇపుడు చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత మళ్లీ కమర్షియల్ జోన్లోకి వెళ్లిపోతోంది. ఇందులో భాగంగానే పుష్పలో ఐటం సాంగ్కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.