నాగచైతన్యతో నిశ్చితార్థం తరువాత ఒక్క నిమిషం కూడా ఖాళీగా లేని సమంత సినిమాల్లో బిజీబిజీగా ఉంటోంది. సావిత్రి, రాజుగారి గది-2లో నటిస్తున్న సమంత ఒక్క క్షణం తీరిక లేకుండా ఉంటోందట. దీనికితోడు మరో మూడు సినిమాలకు అవకాశం రావడంతో సమంత ఒక్కసారిగా బిజీ అయిపోయింది. తనకు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకోవడం కన్నా సమాజ సేవ చేసి మంచి పేరు సాధించామని చెప్పించుకోవడం ఇష్టమని చెబుతోందట సమంత.
పదిమందికి సహాయం చేసి, ఆ పదిమంది మరో పదిమందికి సహాయం చేస్తే వారు మరో పదిమందికి.. ఇలా చేస్తూ ఇబ్బందుల్లో వున్న వారిని ఆదుకోవడం చేయాలన్న కోరిక ఉందని చెబుతోందట. సమంత ఎప్పటి నుంచే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఆ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్ళి సమాజ సేవ చేస్తూ ఒక మథర్ థెరిస్సాలాగా పేరు సంపాదించుకోవాలని ఆశిస్తోందట.