టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ప్రస్తుత పాన్ ఇండియా స్టార్ సమంత రూతు ప్రభు త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నాగ చైతన్యతో లవ్ మ్యారేజ్, ఆపై కొన్నేళ్ళకే విడాకులు.. ఆ వెంటనే తీవ్ర అనారోగ్యం ఇలా వరుస ఇన్సిడెంట్స్ నడుమ సమంత విషయాలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇటీవలే నాగ చైతన్య కూడా రెండో పెళ్లి చేసుకోవడంతో.. సమంత కూడా రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు టాక్.
బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉండనే టాక్ నడుస్తోంది. వీరిద్దరూ సీక్రెట్‌గా ప్రేమాయణం నడుస్తోందని బీ టౌన్ కోడై కూస్తోంది. తాజాగా రాజ్‌ని రెండో పెళ్లి చేసుకోవడానికి సమంత రెడీ అయిందని సమాచారం. సమంత, రాజ్‌ల పెళ్లి మే నెలలోనే ఉంటుందని ఫిలిం నగర్‌లో ప్రచారం జోరుగా నడుస్తోంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారని, ఇక పెళ్లి జరగడమే ఆలస్యం అనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది.
సమంతా రూత్ ప్రభు- నాగ చైతన్య ఇప్పుడు కలిసి లేకపోయినప్పటికీ, తమ పెంపుడు శునకం హుష్‌ని సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. ఇటీవల, చాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలను తీసుకొని జిమ్‌లో వ్యాయామం చేస్తున్నట్లు కనిపించిన చిత్రాన్ని పంచుకున్నాడు. ఆ ఫోటోలో అతని పెంపుడు కుక్క హుష్ కూడా కనిపించింది.
అయితే, ఆ ఫోటో షేర్ అయిన వెంటనే, రెడ్డిట్ యూజర్లు సమంత, చైతన్య హుష్‌ని పెంచుతున్నారా అని ఆశ్చర్యపోయారు. చాలా మంది నెటిజన్లు సమంత, చాయ్ తమ పెంపుడు కుక్కతో ఉన్న పోస్ట్‌ల స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేశారు. దీని వలన ఆ జంట విడిపోయినప్పటికీ, వారు తమ పెంపుడు కుక్కను సహ-తల్లిదండ్రులుగా ఎంచుకున్నారని అభిమానులు అంటున్నారు.