మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి సుజిత్‌తో, బాబీతో సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు.
వీరిద్దరితో పాటు మెహర్ రమేష్‌తో కూడా చిరంజీవి చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు సామాన్య సినీ జనం కూడా మెహర్ రమేష్‌తో మెగాస్టార్ సినిమా చేయనున్నాడా..? అంటూ షాక్ అయ్యారు. ఆ తర్వాత చిరంజీవికి మెహర్ రమేష్‌తో సినిమా వద్దు అని చాలా మంది చెప్పారని... అందుచేత ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి.
దీంతో మెగా ఫ్యాన్స్ హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారని...ప్రచారం జరిగింది. అయితే... ఇప్పుడు మరో షాక్. విషయం ఏంటంటే... మెహర్ రమేష్ - రామ్ చరణ్ కాంబినేషన్ సెట్ అయ్యిందని టాక్. అవును... వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయ్యిందని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తుంది. అయితే... వీరిద్దరి కాంబినేషన్ సినిమా కోసం కాదని... వెబ్ సిరీస్ కోసమని సమాచారం.