విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సంచలన చిత్రం గీత గోవిందం. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమా అందరికీ షాక్ ఇస్తూ రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేసింది. 60 కోట్లకు పైగా షేర్ 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్స్‌కే కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు సైతం షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ పరశురామ్‌కి ఈ సినిమా ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయి అనేది హాట్ టాపిక్ అయ్యింది.
ఈ సినిమా ప్రారంభించేటప్పుడు పరశురామ్‌కి రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటా అన్నారట. అలా చెబితే ఇంకొంచెం శ్రద్ధతో తీస్తారనుకుని అలా అన్నారనుకుంట. తీరా సినిమా రిలీజ్ అయ్యాకా బిగ్గెస్ట్ బ్లాక్‌బష్టర్ అయ్యింది. సినిమా రిలీజైన రెండుమూడు రోజులకు అల్లు అరవింద్ కావాలంటే రెండు మూడు కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకోవచ్చు కానీ.. ఆయన అలా చేయలేదట. ఇచ్చిన మాటప్రకారం లాభాల్లో వాటా ఇస్తానన్నారట. ఆ లెక్క ప్రకారం... పరశురామ్ కి 10 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారట. 6 కోట్లు ఇచ్చేసారట. ఇంకా ఇవ్వాల్సిన 4 కోట్లు త్వరలోనే ఇవ్వనున్నారట. అదీ.. సంగతి.