'జిల్ జిల్ జిగేలు రాణి'ని నట్టేట ముంచారు.. ఎవరు?

మంగళవారం, 17 జులై 2018 (11:59 IST)
రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేలు రాజ పాట ఎంత హిట్టయ్యిందో పెద్దగా చెప్పనక్కర్లేదు. సినిమాలోని ఈ పాట యువకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఐటెం సాంగ్‌లో నటించిన పూజా హెగ్డేకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ పాట పాడిన గాయనికి మాత్రం తీవ్ర అన్యాయం జరిగింది. అసలు ఈ పాట పాడింది ఎవరో ఇప్పటికీ చాలామందికి తెలియదు. 
 
ఈ పాట పాడింది ఒక సాధారణ గృహిణి. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన వెంకటలక్ష్మి అనే మహిళ ఈ పాటను పాడింది. రెండురోజుల పాటు చెన్నైలో ఉన్న వెంకటలక్ష్మి జిగేలు రాజ పాట పాడింది. అసలు ఈమెకు ఎలా ఆ అవకాశం వచ్చిందంటే బుర్రకథల్లో ఎన్నో పాటలు పాడిన వెంకటలక్ష్మిని దర్శకుడు సుకుమార్ యూ ట్యూబ్ ద్వారా చూశారు. దీంతో ఆమెను తీసుకురావాలని కొంతమందికి సూచించారు. మధ్యవర్తులు కొంతమంది వెంకటలక్ష్మిని తీసుకెళ్ళి పాట పాడించారు. సినిమా వందరోజులు పూర్తి చేసుకుంది.
 
కానీ ఇంతవరకు వెంకటలక్ష్మికి మాత్రం రెమ్యునరేషన్ మాత్రం ఇవ్వలేదట. ఇదే విషయాన్ని వెంకటలక్ష్మి మీడియాకు వివరించింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. తన వద్ద దర్శకుడు నెంబర్ గానీ, సంగీత దర్సకుడు దేవిశ్రీ ప్రసాద్ ఫోన్ నెంబర్లు లేవని, ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిని సంప్రదించేవారినని చెబుతోంది వెంకటలక్ష్మి. తన రెమ్యునరేషన్ మొత్తాన్ని మధ్యవర్తులే స్వాహా చేసి ఉంటారని ఆరోపిస్తోంది. వెంకటలక్ష్మి అనకాపల్లిలో ఒక చిన్న ప్రొవిజన్ షాపును నడుపుతోంది. నిరుపేద కుటుంబంలో ఉన్న తమను దర్శకుడు సుకుమార్ ఆదుకోవాలని కోరుతోంది వెంకటలక్ష్మి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు