బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సింగర్‌ను ముంబై పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. తనకు వీరాభిమాని అయిన ఓ మహిళ.. సింగర్‌తో కరచాలనం చేసేందుకు దగ్గరకు వచ్చింది. ఆమెతో కరచాలనం చేసిన తర్వాత హగ్ పేరుతో దగ్గరకు తీసుకుని వక్షోజాలను నొక్కి అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం. దీంతో షాక్‌కు గురైన ఆ మహిళ ఆ సింగర్‌పై ఫిర్యాదు చేయగా, పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
ముంబై బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో 27 యేళ్ళ యశ్ వడలి అనే సింగర్ ఉన్నారు. ఈయన ఓ పార్టీకి హాజరు కాగా, అదే పార్టీకి 39 యేళ్ళ మహిళ ఒకరు వచ్చింది. ఆమె పట్ల ఈయన అసభ్యంగా ప్రవర్తించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సబర్బన్ అంధేరీలోని రెస్టోబార్ ఈవెంట్‌లో లైవ్ ఫర్‌ఫార్మెన్స్ ఇస్తుండగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.