వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2009లో విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత మరో వివాహం చేసుకోకుండా ఒంటరిగానే జీవనాన్ని గడుపుతోంది సోనియా అగర్వాల్. అయితే తాజాగా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కుమారుడితో సోనీయా అగర్వాల్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ కేవలం సింగర్ గానే కాకుండా, నటుడిగా పలు సినిమాల్లో చేసి, అలాగే దర్శకుడిగా, నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తెరకెక్కించాడు. ఇలా మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్నాడు ఎస్పీ చరణ్.
ప్రస్తుతం పాడుతా తీయగా అనే సింగింగ్ షో లో జడ్జి గా పాల్గొంటున్నారు. అయితే ఈయన త్వరలోనే ఓ వెబ్ సిరీస్ చేయనున్నారని సమాచారం. ఆ వెబ్ సిరీస్‌లో సోనియా అగర్వాల్ కీలక పాత్రలో కనిపిస్తుందనే సమాచారాన్ని ఎస్పీ చరణ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ వీరిని కనెక్ట్ చేసిందని.. త్వరలో వీరిద్దరి వివాహం జరుగనుందని కోలీవుడ్ కోడై కూస్తోంది.