కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.... చిత్రాలతో సక్సస్ సాధించి తనకంటూ ఓ గుర్తింపు ఏర్పరుచుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. మహేష్ బాబు హీరోగా తెరకెక్కించిన బ్రహ్మాత్సవం సినిమా డిజాస్టర్ అవ్వడంతో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ ఇబ్బందుల్లో పడింది. బ్రహ్మాత్సవం ఫెయిల్యూర్ తరువాత శ్రీకాంత్‌తో సినిమా చేసేందుకు ఏ హీరో ముందుకు రాలేదు. అందుకే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రీలాంచ్‌లా ప్లాన్ చేస్తున్నాడు ఈ యువ దర్శకుడు.