జబర్దస్త్ కార్యక్రమం తరువాత సుడిగాలి సుధీర్, రష్మిలపై పెద్దఎత్తున వదంతులొచ్చాయి. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకున్నారు. వీరి మధ్య డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని అటు సుడిగాలి సుధీర్ గాని, ఇటు రష్మి గాని ఖండించలేదు. గాసిప్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా మామూలే. ప్రతి ఒక్కరికి ఇలాంటి సమస్య ఉంటుందంటూ వీరిద్దరూ చెబుతూ వచ్చారు.
అయితే తాజాగా రష్మి సుధీర్ గురించి చెప్పిన కొన్ని నిజాలు వింటే ఆశ్చర్యపోక తప్పదు. సుధీర్ నాకు సోదరుడితో సమానం. అంటే మా అన్నయ్యే. నేను సుధీర్‌ను అన్నగా భావిస్తాను. మీరు అనుకుంటున్నట్లు మా ఇద్దరి మధ్యా ఎలాంటివి లేవు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటివి నాపై ప్రచారం చేయడం మానుకోండి. రష్మి అంటే ఇప్పుడు ఒక బ్రాండ్‌గా మారిపోయింది.