పీకల్లోతు ప్రేమలో మునిగిన ప్రిన్స్ మహేష్ హీరోయిన్...

శనివారం, 29 జులై 2017 (14:47 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు చిత్రం 'నేనొక్కడినే'. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ కృతి సనన్ నటించింది. ఈ అమ్మడు బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో ప్రేమాయణం కొనసాగిస్తోంది. కృతి సనన్ తన 27వ పుట్టినరోజు వేడుకలు ఈనెల 27వ తేదీన సుశాంత్ ఇంటిలో జరగడమే ఇందుకు నిదర్శనం. 
 
ఈ బర్త్‌డే రోజున యంగ్ హీరో తన ఇంటికి 'బరేలీ కి బర్ఫీ' టీంని పిలిచి వారి మధ్య కృతి సనన్ బర్త్ వేడుకని గ్రాండ్‌గా నిర్వహించాడట. ఆ తర్వాత కృతి, ఆమె చెల్లెలు నూపుర్ సనోన్‌తో కలిసి పేరున్న హోటల్‌కి డిన్నర్‌కి వెళ్ళాడట. ఈ వ్యవహారాన్ని అంతా చూసిన బాలీవుడ్ మీడియా వీరిద్దరి మధ్య పక్కా ప్రేమ ఉందని కన్ఫాం చేస్తున్నారు. 
 
వాస్తవానికి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టు ఎప్పటి నుంచి పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ. వీటిని కృతి సనన్ ఖండిస్తూ వచ్చింది. అయితే, ఇపుడు తన పుట్టిన రోజు సందర్భంగా తీసుకున్న ఫోటోలు బహిర్గతం కావడంతో వీరిమధ్య ప్రేమ బలంగా ఉందని నిరూపితమైపోయింది.

వెబ్దునియా పై చదవండి