బాహుబలి చిత్రంలో పచ్చబొట్టు వేయించుకున్న పాలపిల్ల తమన్నాపై బాలీవుడ్ ఇండస్ట్రీ గుసగుసలు పోతోంది. తమన్నా పెళ్లికి రెడీ అవుతోందనీ, పెళ్లి తర్వాత సినిమాలు చేయదనీ ఏదో రాసేస్తుంది. కాగా తాజాగా తమన్నా నటించిన ఊపిరి చిత్రం సూపర్ సక్సెస్ సాధించి ముందుకు వెళుతోంది. ఈ దశలో తమన్నా పెళ్లి చేసేసుకుంటుందంటే నమ్మడం కష్టమే మరి. చూద్దాం... నటి అసిన్లా ఝలక్ ఇస్తుందేమో...?