ఇదిలా వుంటే, గతంలో రామ్‌చరణ్ సినిమా వేడుకలకు చిరంజీవి హాజరయితే పవన్‌కళ్యాన్ రాకపోవడంతో అభిమానులు పవన్ ఏడీ, ఎక్కడ.. అంటూ హడావుడి చేసేవారు. అయితే ఈసారి మరో సమస్య తలెత్తుందని మెగాస్టార్‌కు పలువురు సూచనలు చేశారు. ఇప్పటికే వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీకి మద్దతు తెలపడంతో అది పెద్దగా సినిమా వేడుకలో చర్చ రాదు. కానీ ఎన్నికలు, పవన్ కళ్యాణ్ జనసేనకు ఎటువంటి సపోర్ట్ చేస్తారు. పార్గీలో మీ ప్రమేయం ఎంత అనేది కూడా అభిమానుల నుంచి రావచ్చని విశ్వసనీయ సమాచారం. ప్రతిపక్షాలకు చెందిన అభిమానులు ఈ వేడుకకు వచ్చే సూచనలు వున్నాయని తెలుస్తోంది. ఒకరకంగా మెగాస్టార్‌కు సవాల్‌లాంటి వేడుకని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.