ముద్దంటే అంత చేదు కాదు కదా. అదీ అందమైన హీరోయిన్ దొరికితే.. ఏ హీరో అయినా లిప్ లాక్ సీన్ చేస్తుంటే వదిలిపెడతాడా? అలాంటి బంపర్ ఆఫర్ హీరో టైగర్ ష్రాఫ్‌కు దొరికింది. ప్రస్తుతం సినిమాల్లో ముద్దు సీన్లకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గత శుక్రవారం రిలీజైన బాలీవుడ్ చిత్రం 'ఏ ఫ్లైయింగ్ జాట్'లో కూడా హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ల మధ్య అటువంటి ముద్దు సన్నివేశమే ఒకటుందట.
ఈ ముద్దు సీన్ వెనక పెద్ద కథే వుంది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఈ సీన్ చిత్రీకరించే సమయంలో లిప్ లాక్ సీన్లో పూర్తిగా లీనమైన టైగర్, జాక్వెలిన్‌లు కిస్ సీన్‌ను బాగా పండించారట. డైరెక్టర్ రెమో డిసౌజా సీన్‌కి కట్ చెప్పినా కూడా హీరోహీరోయిన్లు అలానే ముద్దులో లీనమైపోయారట. ఎలా ముద్దెట్టుకోవాలో దర్శకుడు చెప్పినదానికంటే ఎక్కువే చేసి ఆ సీన్‌ను రియల్ సీన్లా పండించారు.