నిర్మాత సరైనవిధంగా ఖర్చు పెట్టకుండా చేతులు ఎత్తేశాడనీ, కొన్ని ఏరియాలకు అమ్మేసి.. చేతులు దులుపుకున్నాడనీ.. ప్రమోషన్ కూడా సరిగ్గా చేయలేదని దాంతో.. సినిమా సరిగ్గా ఆడలేదని విమర్శిస్తున్నాడు. కాగా, సదరు నిర్మాత.. దర్శకుడిపై కౌంటర్ వేస్తూ.. దర్శకుడు సరిగ్గా తీయలేకపోవడంతోనే సినిమా ఆడలేదంటూ.. పేర్కొన్నాడు.
ఏదిఏమైనా.. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తే బాగుండేదని దర్శకుడు చెప్పినా వినలేదనీ.. ఇప్పుడు తమిళ వెర్షన్.. కొన్ని సీన్లు మార్చి.. తీయాల్సివచ్చిందనీ.. ఈ శుక్రవారమే అక్కడ విడుదలవుతుందని దర్శకుడు వెల్లడిస్తున్నాడు.