సూపర్ స్టార్ మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి సినిమా చేయాలనుకున్నారు. మహర్షి సినిమా ఇద్దరికీ మంచి పేరు తీసుకురావడంతో వెంటనే వీరిద్దరూ సినిమా చేయాలనుకున్నారు కానీ.. ఈ ప్రాజెక్ట్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత మహేష్ బాబు పరశురామ్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. అయితే.. వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ మాత్రం ఇంకా సెట్ కాలేదు. మరోసారి మహేష్ బాబుకి కథ చెప్పారు వంశీ.
ఎన్టీఆర్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన బృందావనం సినిమా సక్సస్ అయ్యింది. దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. అయితే.. వంశీ ఎన్టీఆర్‌ని మెప్పిస్తే... ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి.. ఎన్టీఆర్ తన కథతో మెప్పిస్తాడో లేదో చూడాలి.