టాలీవుడ్‌లో షాకింగ్ న్యూస్ : 'వంగవీటి' నిర్మాత కిడ్నాప్!

మంగళవారం, 27 డిశెంబరు 2016 (15:55 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఓ షాకింగ్ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం "వంగవీటి". ఈచిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌ కిడ్నాప్‌కు గురయ్యారు. సోమవారం నుంచి ఆయన కనిపించక పోవడంతో ఆయన్ను ఎవరైనా కిడ్నాప్ చేసివుంటారని భావిస్తున్నారు. దీంతో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. 
 
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన 'వంగవీటి' చిత్రం టైటిల్ ఫిక్స్ చేసినప్పటి నుంచి వివాదాలు చెలరేగాయి. సినిమా రిలీజ్ అయ్యే సరికి వివాదాలు కాస్త పీక్స్‌కి చేరిపోయాయి. రిలీజైన తర్వాత కూడా వంగవీటి రాధ - వర్మ బస్తీ మే సవాల్ అనే దాక వెళ్లాయి.
 
అయితే, ఇప్పుడు 'వంగవీటి' చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కనిపించపోవడం హాట్ టాపిక్‌గా మారింది. చిత్రం విడుదలకు ముందు, రిలీజైన తర్వాత వర్మకి మాదిరిగానే నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌కి కూడా బెదిరింపు, హెచ్చరికలు వచ్చాయి. ఆ తర్వాత వంగవీటి ఫ్యామిలీతో చిత్ర దర్శకుడు, నిర్మాత భేటీ అయ్యారు. 
 
తీరా 'వంగవీటి' రిలీజ్ తర్వాత నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఎక్కడా కనిపించడం లేదట. కనీసం సినిమా రిజల్ట్స్, కలెక్షన్స్ విషయంలో మీడియా ముందుకు వచ్చి ఎలాంటి ప్రకటన చేయడం లేదట. దీన్ని బట్టి చూస్తుంటే.. వంగవీటి నిర్మాత కిడ్నాప్ అయ్యాడని బెజవాడ వాసులు సరదాగా సటైర్స్ వేసుకొంటున్నారు. ఇంతకీ వంగవీటి నిర్మాతని కిడ్నాప్ చేసేంది ఎవరంటారు.. !?

వెబ్దునియా పై చదవండి