14 ఏళ్ల క్రితం విక్రమ్ సరసన త్రిష నటించిన బ్లాక్ బస్టర్ మూవీ "సామి". ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో విక్రమ్‌నే హీరోగా ఎంచుకున్నారు. కానీ త్రిషనే హీరోయిన్‌గా తీసుకున్నారు. దీంతో పాటుగా మోహిని, గర్జనై, 1818, శతురంగ వేట్టై-2, హేయ్ జూడ్, 96 అనే ఐదు సినిమాల్లో త్రిష కథానాయికగా నటిస్తోంది. 34 ఏళ్ల వయసులో దక్షిణాది హీరోయిన్ అయిన త్రిష చేతినిండా భారీ ఆఫర్లను దక్కించుకోవడంతో ఖుషీ ఖుషీగా ఉంది.
అయితే త్రిషకు సామి-2 సినిమాలో రోల్ పరిమితమేనని తేలింది. ‘నేను శైలజ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేశ్ సామి-2కి హీరోయిన్‌గా ఎంపికైంది. ‘సింగం’ సిరీస్ చిత్రాల దర్శకుడు హరి.. చియాన్ విక్రమ్‌తో కలిసి ‘సామి 2’ తెరకెక్కించబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ ‘సామి’కి ఇది సీక్వెల్. ఇందులో కీర్తి సురేశ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.