అక్కినేని వారసుడు అఖిల్ ప్రేమాయణం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అఖిల్ ప్రేమలో పడింది పాపులర్ ప్యాషన్ డిజైనర్ శ్రీయా భూపాల్‌తోనని సోషల్ వెబ్‌సైట్లలో ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఫ్యాషన్ ప్రపంచంలో శ్రియా బాగా పాపులర్. ఆమెకు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా ఫ్యాషన్ డిజైనర్ కావడంతో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ఆమె ప్యాషన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుందట.
కాగా వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఈ మధ్య కాలంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అఖిల్ కూడా తాను ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకోవడమే ఇందుకు కారణం. అఖిల్ తాను ప్రేమలో పడినట్టు ఓ ఇంటర్వ్యూలో ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆమె వివరాలు బయటకు లీక్ అయ్యాయి. నాగార్జున కూడా వీరి ప్రేమను అంగీకరించడంతో అఖిల్ లవ్ విషయంలో మరింత బలం చేకూరింది.
అయితే అఖిల్ ప్రేమాయణం గురించి మీడియాలో వార్తలు రావడమే తప్పితే... ఇప్పటివరకు వీరిద్దరు కలిసి దర్శనమివ్వలేదు. ఎట్టకేలకు అఖిల్ తన ప్రియురాలితో కలిసి కెమెరాకు చిక్కాడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో అఖిల్ తన ప్రియురాలితో కలిసి దిగిన ఫోటోస్ సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. ప్రియురాలు శ్రేయా భూపాల్‌తో కలిసి అఖిల్ తొలిసారి కెమెరాకు చిక్కడంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.