ప్రభుదేవా ప్రమేయంతో నయనకు బాలీవుడ్ ఛాన్సు..!?

సాధారణంగా ప్రియురాలికి ప్రేమికుడు ఏదో గొప్ప బహుమతినివ్వడం పరిపాటి. కానీ ఫిలిమ్ నగర్లో కొంతకాలం ప్రేమికులుగా అందరి నోట్లో నానుతోన్న ప్రభుదేవా-నయనతారల ప్రేమాయణంలో కొత్త సంగతి వెలుగులోకి వచ్చింది. 

ఇందులో విషయమేమిటంటే..? కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడైన ప్రభుదేవా.. తన ప్రియురాలు అయిన సెక్సీడాళ్ నయనతారకు బాలీవుడ్ ఛాన్సు ఇస్తున్నాడని తెలిసింది.

సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో విడుదలైన "వాంటెడ్" సూపర్ సక్సెస్ బాటలో పయనిస్తుండటంతో తిరిగి అదే టీమ్‌తో "మోస్ట్ వాంటెడ్" అనే సినిమాను నిర్మించేందుకు బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రంలో నయనతారకు అవకాశం ఇవ్వాలని ప్రభుదేవా నిర్మాత బోని కపూర్‌కు సిఫార్సు చేసినట్లు సమాచారం. బోనీ కపూర్ కూడా నయనకు అవకాశం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు భోగట్టా. అయితే ఇంకా ఆమెను హీరోయిన్‌గా ఖరారు చేయలేదని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో నయనను రంగప్రవేశం చేయడంలో ప్రభుదేవా ఆసక్తిని చూస్తే వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతూనే ఉందని ఫిలిమ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి