ప్రభుదేవాను పిచ్చిపిచ్చిగా ఇష్టపడతుంటా: నయనతార

ఇటీవల నయనతార నటించిన ఘటికుడు చిత్రంలో నయన తన అందాలను దాచుకోవడంపై తాము ఎంతో నిరాశ చెందామని టీనేజ్ కుర్రకారు ఆమెకు కుప్పలు తెప్పలుగా మెయిల్స్ పంపుతున్నారట. సెల్యూట్, వల్లభ చిత్రాల్లో రెచ్చిపోయి శరీరాన్నంతా చూపించిన నయన ఒక్కసారిగా ఈ చిత్రంలో ఒళ్లును కప్పేసుకున్నట్లు నటించింది. పాటల్లో తప్ప మిగిలిన సన్నివేశాల్లో ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంది. 

కుర్రకారు అడుగుతున్న ప్రశ్నలకు నయనతార స్పందించడానికి ప్రస్తుతం అందుబాటులో లేదు. ప్రియుడు అని చెప్పబడుతున్న నృత్య దర్శకుడు ప్రభుదేవా సిఫార్సుతో బాలీవుడ్ అవకాశాలను వెతుక్కుంటోంది.

శ్రియ, అసిన్ బాలీవుడ్‌ను దున్నేస్తున్నారనీ, నీకు వారికంటే ఎక్కువ సత్తా ఉందని ప్రభుదేవా చెప్పాడట. చెప్పడమే కాదు... తనకు బాలీవుడ్ నిర్మాతలతో ఉన్న స్నేహ సంబంధాలను ఉపయోగించి నయనకు ఛాన్సులను ఇప్పించే పనిలో ముమ్మరంగా ఉన్నాడట.

నయన అంటే ప్రభుదేవాకు ఎంత శ్రద్ధ. అన్నట్లు ప్రభుదేవాను తను పిచ్చిగా ఇష్టపడుతుంటానని నయనతార ఓ టీవీ ఇంటర్యూలో డైరెక్టుగా చెప్పింది. మరి ప్రభుదేవా భార్య ఈ మాటను విన్నదో లేదో....

వెబ్దునియా పై చదవండి