బిడ్డకు తల్లి అయినా మళ్లీ వస్తోంది లారాదత్తా

సోమవారం, 9 జులై 2012 (13:18 IST)
లారా.. ఈ పేరు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదూ. టెన్నిస్‌ క్రీడాకారుడు మహేష్‌ భూపతి భార్య. 2000లో మిస్‌ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న ఈమె హిందీ చిత్రాలకే పరిమితమైంది. ఓ బిడ్డకు తల్లి అయినా లారా తాజాగా తమిళ సినిమాలో నటించడానికి సిద్ధమైంది. 

విక్రమ్‌ హీరోగా 'డేవిడ్‌' అనే చిత్రం రూపొందబోతోంది. రిలయన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో లారాదత్తా నాయికగా నటిస్తోంది. విక్రమ్‌ చేపలు పట్టే వ్యక్తిగా నటిస్తున్నాడు. నటిగా కొత్తమలుపు తిరుగుతుందని చెబుతోంది. డేవిడ్‌ చిత్రాన్ని హిందీతోపాటు తెలుగులో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. అనిరుధ్ పాటలు రాశాడు. చూద్దాం.. లారా సిల్వర్‌స్క్రీన్‌పై ఎలా కనబడుతుందో..?

వెబ్దునియా పై చదవండి