హీరోయిన్‌గా మంచి బ్రేక్ కోసం "అంజలీ పాప" కసరత్తు!

WD
"అంజలి" సినిమా ద్వారా బాలనటిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన షామిలి.. తాజాగా కథానాయికగా మార్కులు కొట్టేయాలని భావిస్తోంది. ప్రముఖ నటి షాలిని సోదరి, కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్ మరదలైన షామిలీ "నువ్వొస్తానంటే.. నేనొద్దాంటానా" ఫేమ్ సిద్ధార్థతో "ఓయ్" చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది.

ఈ సినిమా షామిలికి మంచి ఓపెనింగ్ ఇచ్చినా.. మంచి బ్రేక్ కోసం అంజలి పాప బోలెడు కథలు వింటుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. టాలీవుడ్ మాత్రమే గాకుండా.. కోలీవుడ్‌లోనూ కథానాయికగా రంగప్రవేశం చేసేందుకు షామిలీ సన్నాహాలు చేస్తోంది.

మంచి కథ, క్రేజీ హీరో, దర్శకుడు లభిస్తే.. సినిమాచేసేందుకు షామిలి సై అంటోందని తెలిసింది. మంచి కథ దొరికితే నటించడంతో పాటు.. చదువుపై కూడా శ్రద్ధ పెట్టేందుకు షామిలి కృషి చేస్తోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

మరోవైపు.. హోమ్లీ పాత్రలకు షామిలి సరిపోతుందని సినీ విశ్లేషకులు భావిస్తుంటే.. అమ్మడు మాత్రం తగిన మోతాదులో అందాలను కూడా ఆరబోసేందుకు సిద్ధమైందని తెలిసింది. ఇంకా చెప్పాలంటే..? పాత్రకు తగినంత ఎక్స్‌పోజింగ్ కూడా చేస్తానని షామిలి సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. మొత్తానికి బ్రేక్ హీరోయిన్‌గా రాణించాలంటే.. కొన్ని సూత్రాలు పాటించక తప్పదని షామిలి బాగా తెలిసి పెట్టుకుని ఉందని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.

ఇంకేముంది..? "ఓయ్" చిత్రంలో యంగ్ హీరో సిద్ధార్థ సరసన సంధ్యగా యూత్‌ను ఆకట్టుకున్న షామిలి.. తన తదుపరి చిత్రం ద్వారా మంచి గుర్తింపు సాధిస్తుందని సినీ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. మరి మనం కూడా షామిలికి ముందుగానే ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం..!.

వెబ్దునియా పై చదవండి