రేప్‌చేయ్. రేప్‌చేయ్... అంటూ తనకొక పాట విన్పించాడు... అప్పుడు నేను 'మిస్టర్ నోకియా' షూటింగ్లో ఉన్నాను. ఇదేంటి.. రేప్చేయి అంటాడు...అని కిషోర్‌ను అడిగాను... పాట మొత్తం వినండి అని చెప్పాడు.. విన్నాక.. తెలిసింది. ఇందులో యూత్‌కు సందేశం ఉందని.. అంటే రేప్ చేయమని కాదు.. యూత్‌కు రివర్స్‌లో చెబితేగానీ ఎక్కదని డిసైడ్ అయినట్లున్నాడు... అది సినిమా చూశాక మీకే తెలుస్తుంది... అని 'వెన్నెల 1 1/2' సినిమా గురించి మంచు మనోజ్ తెలిపారు.
ఈ చిత్రం ఆడియో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ... కిషోర్ టైమింగ్ అంటే ఇష్టం.. బాగా చేశాడు... ఇప్పుడు దర్శకుడు అయ్యాడంటే.. ఆశ్చర్యమేసింది... నిర్మాతలు వాసు, వర్మలు మా ఊరి వాళ్ళే... వాళ్ళ నాన్నగారు ఎం.ఎల్.ఎ. గారు నన్ను ఫంక్షన్‌కు ఆహ్వానించారన్నారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న దేవకట్టా మాట్లాడుతూ... అసలు కిషోర్.. నేను వెన్నెల సినిమా చేస్తున్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనికోసం వచ్చాడు.. అనుకోకుండా.. ఖాదర్‌ఖాన్ పాత్రకు క్యారెక్టర్ రాకపోవడంతో... తప్పనిసరి కిషోర్ వేశాడు. అదే చిత్రాన్ని నిలబెట్టింది.. ఇప్పుడు డైరెక్టర్కూడా అయ్యాడు... అని ఈ కథనాకు తెలుసు.. మంచి సక్సెస్‌కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇంతకీ.. ఇందులో రేపచేయి- అనేపాటుంది.. అది యూత్‌కు బాగా నచ్చుతుంది అని ముగించారు.