మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రధారిగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం `ఆచార్య`. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దేశంలో నెలకొన్న కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా సినిమా విడుదలను వాయిదా చేస్తున్నట్లు , పరిస్థితులు చక్కబడగానే సినిమా విడుదల తేదీకి సంబంధించిన ప్రకటనను వెలువరిస్తామని మంగళవారంనాడు నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ప్రకటించారు.
షూటింగ్‌కూ బ్రేక్
ఇదిలా వుండగా, కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆచార్య షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే ఈ సినిమా కోసం 20 కోట్ల రూపాయల ఖర్చుతో 20 ఎకరాల్లో ఒక భారీ సెట్ వేశారు. ధర్మస్థలి పేరుతో ఒక ఆలయం, దాని పరిసరాలకు సంబంధించిన సెట్ ఇది. ఇది ఒక ఫైట్ కోసమో, పాట కోసమో వేసిన సెట్ కాదట. సినిమాకి సంబంధించిన 60 శాతం షూటింగు ఈ సెట్ పరిధిలోనే జరుగుతుందని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ మొత్తం ఈ సెట్ లోనే జరుగుతుందని తెలుస్తోంది.
నటీనటులు:
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సోనూసూద్ తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: కొరటాల శివ
బ్యానర్స్: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్
మ్యూజిక్: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణ్ణావుక్కరసు