ఓ మహిళ నవజాత శిశువును ఫ్రీజర్‌లో పెట్టి మరిచిపోయింది. ప్రసవానంతరం తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆ మహిళ మతిమరుపు కారణంగా తన బిడ్డను మర్చిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ప్రస్తుతం చిన్నారికి చికిత్స అందిస్తున్నామని, ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సదరు మహిళ ప్రసవానంతరం మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు.