సినీ హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి చెందిన అధికారిక యూట్యూబ్ చానెల్ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ చానెల్‌ను ఇష్టపడుతూ, సబ్ స్క్రైమబ్ చేసిన వారి సంఖ్య 10 లక్షలు దాటిపోయింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. పది లక్షల మంది సబ్ స్క్రైబర్లు చేరుకున్న జనసేన అధికారిక యూట్యూబ్ చానెల్ అని ట్విట్టర్‌లో తెలిపింది.
ఈ సందర్భంగా పార్టీకి మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు చెప్పింది. మరోవైపు, జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర మంగళవారం భీమవరంలో కొనసాగనుంది. ఇందులోభాగంగా, ఆయన ఉదయం నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించి, వారికి మార్గనిర్దేశం చేయనున్నారు.
కాగా, నరసాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ మరోమారు వైకాపా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ హోదాలో బటన్ నొక్కని జాబితాను చదివి వినిపించారు. పూర్తికాని పోలవరం ప్రాజెక్ట్ బటన్, రానీ ఉద్యోగాల నోటిఫికేషన్ బటన్, నష్టపోయిన రైతు పరిహారం బటన్, ఇల్లు కోల్పోయి దీనస్థితిలో ఉన్న మత్స్యకారుల బటన్, మద్దతు ధర రాని కొబ్బరి సాగు బటన్, దగ్ధగ్డమవుతున్న దేవాలయాలు, అంతర్వేది రథం బటన్, పూర్తి కానీ బ్రిడ్జి బటన్, దళితులను చంపి బయట తిరుగుతున్న ఎమ్మెల్సీ బటన్, ఆక్వా రైతుకు రూ.1.5కు యూనిట్ విద్యుత్ ఇవ్వని బటన్, కోనసీమ రాని రైలు బటన్ ఇలా గత ఎన్నికల్లో ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చని హామీలను చదివి వినిపించారు.