'2.O' మూవీ దెబ్బకు 12 వేల పైరసీ వెబ్‌సైట్లు బ్లాక్

గురువారం, 29 నవంబరు 2018 (14:39 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌లు నటించిన చిత్రం "2పాయింట్ఓ". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రూ.550 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్ర నిర్మాతలను పైరసీ భూతం ఎంతో భయాందోళనలకు గురిచేసింది. 
 
సినిమా రిలీజ్ రోజే చిత్రం వైబ్‌సైట్స్‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో నిర్మాత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ప్ర‌స్తుతం త‌మిళ్ రాక‌ర్స్ అనే సంస్థ పైరసీ రారాజుగా మారిపోయిన విషయం తెల్సిందే. ఎంత‌టి పెద్ద హీరో సినిమా అయిన దానిని నిమిషాల‌లో పైర‌సీగా మార్చి వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్ చేస్తోంది. 
 
దీంతో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన "2.0" చిత్రం పైర‌సీ బారినప‌డ‌కుండా చూడాల‌ని చిత్ర నిర్మాణ సంస్థ మ‌ద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి ఎం.సుంద‌ర్ కీలక ఆదేశాలు జారీచేశారు. 
 
పైరసీకి పాల్పడుతున్న 12 వేల వెబ్‌సైట్స్‌ని బ్లాక్ చేయ‌మ‌ని 37 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకి ఆదేశించాడు. ఇందులో 2,000 కంటే ఎక్కువ వెబ్‌సైట్స్ తమిళ్ రాకర్స్ ఆధీనంలో ఉండటం గమనార్హం. అయితే, న్యాయస్థానం ఆదేశాల తర్వాత అయిన ఈ చిత్రం పైరసీ బారినపడకుండా ఉంటుంగా లేదో చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు