రోప్‌స్టంట్ ఫైటింగ్.. 'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్వీకి గాయాలు

మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (05:19 IST)
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ పృథ్వీ షూటింగ్ స్పాట్‌లో గాయపడ్డాడు. దీంతో అతన్ని ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. 
 
మెగా హీరో సాయిధరమ్‌ తేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రంలో పృథ్వీ నటిస్తున్నాడు. గోపీచంద్‌ మల్లినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా రోప్‌స్టంట్‌ ఫైటింగ్‌ దృశ్యాన్ని చిత్రికరీస్తుండగా అది వికటించడందో పృథ్వీకి చిన్నపాటి గాయాలయ్యాయి. 
 
చిత్రయూనిట్‌ ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. తాను గాయపడిన విషయాన్ని ఫేస్‌బుక్‌లో తెలిపిన పృథ్వీ.. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి