ఈ చిత్రంలో నాగార్జున, అమల ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ క్లాసిక్ చిత్రాన్ని ఇప్పటి దర్శకులు కూడా ఆదర్శంగా తీసుకుంటారనేది వాస్తవం. అప్పట్లో ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాగార్జున సైకిల్ చైన్ లాగడం అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పవచ్చు.
విమర్శకులు సైతం ఈ సినిమాని పొగడకుండా ఉండలేకపోయారు. అక్టోబర్ 5,1989న విడుదలైన ఈ చిత్రం నేటితో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వర్మ శివ సినిమా పోస్టర్‌ని తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ నాగార్జునా.. నేడు మన ప్రియమైన బిడ్డ 30వ బర్త్‌డే అని కామెంట్ పెట్టాడు.