'పుష్ప' బిగ్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?

సోమవారం, 2 ఆగస్టు 2021 (14:16 IST)
దేవీశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప' మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. పుష్ప యూనిట్ ఫస్ట్ సింగిల్ ఎపుడు విడుదల చేస్తుందని ప్రకటించారు. 'పుష్ప' సినిమా విషయానికొస్తే.. 'ఆర్య', 'ఆర్య 2' తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ ఎర్ర చందనం స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది.
 
ఈ సినిమా స్టోరీ నిడివి ఎక్కువ కావడంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు మూవీ మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఆహార్యం కూడా డిఫరెంట్‌గా కొత్తగా ఉంది. ముందుగా ఈ సినిమాను ఆగష్టు 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ కరోనా అందరి ఆశలపై నీళ్లు చల్లంది. దీంతో ఈ సినిమాను విడుదల చేస్తానన్న ఆగష్టు 13న ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నారు. ఐదు భాషల్లో ఐదుగురు గాయకులు ఈ సినిమా పాట పాడుతున్నట్టు ఓ వీడియోను విడుదల చేసారు.
 
'పుష్ప' సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను ఐ తెలుగులో శివమ్ పాడనున్నారు. కన్నడలో విజయ్ ప్రకాష్ .. మలయాళంలో రాహుల్ నంబియార్.. బెన్ని దయాల్ తమిళం.. హిందీలో విశాల్ దద్లాలీ ఈ పాటను పాడనున్నట్టు తెలిపారు. మొత్తంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

5 Languages, 5 singers & One Rocking Tune by @ThisIsDSP

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు