కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. కన్నడ సూపర్ డూపర్ హిట్ మూవీ "కాంతార"కు అవార్డుల పంట పండింది. ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాలో నటనకుగాను రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. మలయాళ చిత్రం "అట్టం" జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ జాతీయ అవార్డుల వివరాలను పరిశీలిస్తే,
ఉత్తమ నటుడు - రిషభ్ శెట్టి ( కాంతార)
ఉత్తమ నటి - నిత్య మీనన్ ( తిర చిత్రాంబలం), మానసి పరేఖ్ ( కఛ్ ఎక్స్ ప్రెస్ )
ఉత్తమ సహాయ నటుడు - పవన్ రాజ్ మల్హోత్రా (ఒరియా )
ఉత్తమ నటి సహాయ నటి - నీనా గుప్తా (ఉంచాయి)
ఉత్తమ దర్శకుడు - సూరజ్ బర్జాత్యా ( ఉంచాయి)
బెస్ట్ పాపులర్ ఫిల్మ్ - కాంతార (కన్నడ )
బెస్ట్ సినిమాటోగ్రఫీ - రవివర్మన్ (పొన్నియన్ సెల్వన్ -1)
బెస్ట్ మ్యూజీషియన్ - శివ, ప్రీతమ్ ( బ్రహ్మాస్త్ర)
బెస్ట్ రీ రికార్డింగ్ - ఏఆర్ రెహమాన్ ( పొన్నియన్ సెల్వన్ 1)
బెస్ట్ కొరియోగ్రాఫర్స్ - జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ (తిరుచిట్రాంబలం)
బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ - అన్బరివు (కేజీఎఫ్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - తెలుగు - కార్తికేయ 2
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - తమిళం - పొన్నియన్ సెల్వన్ -1