కొంప ముంచిన 100 గ్రాముల అధిక బరువు.. వినేశ్ ఫోగాట్‌కు షాక్.. అనర్హత వేటు!!

వరుణ్

బుధవారం, 7 ఆగస్టు 2024 (12:38 IST)
పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో ఏదో ఒక పతకాన్ని సాధిస్తున్న ఎదురు చూస్తున్న భారత అభిమానులకు తేరుకోలేని షాక్ తగిలింది. భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ ఈ పోటీల నుంచి అనూహ్యంగా వైదొలగాల్సివచ్చింది. ఆమె 50 కేజీల బరువు కంటే 100 గ్రాములు అధిక బరువును కలిగివున్నారు. ఇదే ఆమె కొంప ముంచింది. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఆమెపై అనర్హత వేటు వేసింది. 
 
నిజానికి బుధవారం సాయంత్రం 50 కేజీల విభాగం ఫైనల్ పోటీల్లో ఆమె తలపడాల్సివుంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాముల్ అధికంగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో వినేశ్‌పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
"వినేశ్ ఫొగాట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటు ఎదుర్కోవాల్సివచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి వినేశ్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరం" అని భారత ఒలింపింక్ సంఘం పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు