శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా `శ్రీకారం`. కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ఆచంట, గోపీఆచంట నిర్మించారు. ఈనెల 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. కెటిఆర్‌తోపాటు సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు.
అనంతరం హీరో శర్యానంద్ మాట్లాడుతూ, తీరిక లేకపోయినా కె.టి.ఆర్.గారు వచ్చినందుకు థ్యాంక్స్. ఈ కథే ఆయన రావాలని కోరుకుంది. ఈ చిత్రంలో యూత్ తలుచుకుంటే ఏం చేయగలరో చూపించాం.. కేటీఆర్ ఓ యూత్ ఐకాన్. ఆయనలాంటి వారు ఒకరు వచ్చి మాట్లాడితే అందరూ వింటారని నమ్మకం.. వ్యవసాయం ఎంత ముఖ్యమైందనేది చూపించాం. ఇది తండ్రి బాటలో నడిచే కొడుకు కథ. అన్ని ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. కాస్త ప్రేమ నవ్వించే విలన్. ఏడిపించే విలన్. అందమైన అమ్మాయి అన్నం పెట్టే భూమి. వీటన్నంటిని చుట్టూ తిరిగే నా క్యారెక్టర్.
ఈ కథ విన్నప్పుడే ఈ సినిమా చేయడం నా బాధ్యత. సినిమా చేయాలి అని అనుకున్నాను. ఈ సినిమాను మీ అందరూ చూడాలి. అది మీ బాధ్యత.. ఓ మంచి పని చేస్తే చెప్పు నేను ఉన్నాను అని కేటీఆర్ గారు అన్నారు. అందుకే కేటీఆర్ అన్నకు థ్యాంక్స్ చెప్పలేను. ఆయనకు ఓ మెసెజ్పెట్టాను. ఏంటి శర్వా అని వెంటనే ఫోన్ చేశారు. అలా ఫోన్ రావడంతో షాక్ అయ్యాను. ఇలా వెంటనే రియాక్ట్ అయ్యే నాయకుడు ఎవ్వరూ లేరు. ఇండియాలో ఇలాంటి పొలిటీషియన్ లేడు. కథను కిషోర్ రాస్తే ప్రాణం పోసింది సాయి మాధవ్ బుర్రా.
ప్రతీ డైలాగ్ ఎంతో గొప్పగా రాశారు.. మిక్కీ జే మేయర్ మంచి పాటలు అందించారు. నటీనటులందరూ ఎంతో గొప్పగా నటించారు. వెనకలా శ్రీవారి మెట్లు, కొండలు, ఆ అందమే వేరు. డీఓపీ యువరాజ్ ఎంతో అద్భుతంగా చూపించారు. 12ఏళ్ల తరువాత మళ్లీ రావు రమేష్‌తో కలిసి నటించాను. మంచి కథతో వచ్చాం.. గమ్యంతో ఆయనా (రావు రమేష్) స్టార్ట్ అయ్యారు, నా ప్రయాణం స్టార్ట్ అయింది.
రావు రమేష్, నరేష్ వంటి వారితో చేయాలంటే మంచి కథతోనే చేయాలి. ఈ సినిమా కథ వినడానికి ఆరు నెలలు ఎదురుచూసేలా చేశాను. బిజీగా ఉండటం వలన వినలేకపోయాను. కానీ పట్టుబట్టి మరీ వినిపించి ఒప్పించారు..ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. కమర్షియల్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఎన్నైనా కొట్టొచ్చు కానీ శ్రీకారం లాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు.. అలాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్.. జై జవాన్ జై కిసాన్.. అని అన్నారు.
సొంతూరు చూసినట్టు ఉంటుంది.
పాటల రచయిత భరద్వాజ మాట్లాడుతూ.. శ్రీకారం సినిమాలోలో నేను రెండు పాటను రాశాను.. సంక్రాంతి పాట, రెండు బిట్ సాంగ్స్‌ను రాశాను.. అద్భుతమైన సందర్భం క్రియేట్ చేసిన దర్శకుడు, మంచి ట్యూన్స్ ఇచ్చిన మిక్కీ జే మేయర్, మనసును హత్తుకునేలా పాడిన సింగర్లకు కృతజ్తతలు తెలుపుకుంటున్నాను. మార్చి 11న మా సినిమా రాబోతోంది.. ఈ సినిమాను చూస్తుంటే మీ సొంతూరును చూసినట్టుఉంటుంది. మా సినిమా టికెట్‌తో పాటు మీ ఊరికి కూడా టికెట్‌ను బుక్ చేసుకోండి అని అన్నారు.
ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా
ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. తెలుగు చిత్ర సీమలో నిర్మాతలు చాలా మంది ఉన్నారు. ఇంత ప్యాషన్ ఉన్న వాళ్లు మాత్రం వీళ్లే. ఓ పది కోట్లు, మంచి స్క్రిప్ట్ రెండూ పక్కన పెడితే రెండింట్లో మంచి స్క్రిప్ట్‌నే ఎంచుకుంటారు.. పది కోట్లు కావాలంటే తరువాత సంపాదించుకుంటామని అంటారు. అలాంటి గొప్ప నిర్మాతలైన రామ్ అండ్ గోపీకి మరో విజయవంతమైన సినిమాకు శ్రీకారం చుట్టాలి. అదృష్టవశాత్తు మన హీరోలు ఇలాంటి సబ్జెక్ట్ చెప్పినప్పుడు కమర్షియల్ గురించి ఆలోచిస్తారు. కానీ శర్వానంద్ అలా ఆలోచించలేదు.. ఇదో గొప్ప చిత్రంగా నిలుస్తుంది. డాక్టర్ కొడుకు డాక్టర్.. ఇంజనీర్ కొడుకు ఇంజనీర్.. అవ్వాలని అనుకుంటారు. కానీ రైతు కొడుకు రైతు అవ్వాలని అనుకున్నప్పుడే ఈ సినిమాకు నిజమైన నివాళి.. ఇలాంటి మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చినందుకు కిషోర్‌కు థ్యాంక్స్. రైతు పండించే ధాన్యం తినే ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా అని చెప్పుకొచ్చారు.
కొత్త దర్శకుడు తీసిన సినిమాలా అనిపించలేదు..
డీఓపీ యువరాజ్ మాట్లాడుతూ.. కొంత మంది హీరోలు, నటులతో పని చేసేటప్పుడు కాస్త కష్టం అవుతుంది.. ఎందుకంటే వాళ్ల నటనతో మనమే లాక్ అవుతాం.. మన పని మనం చేస్తున్నామా? లేదా? అని ఆలోచనలో పడతాం.. మీ(శర్వానంద్) నటనకు నేను పెద్ద అభిమానిని..ప్రియాంక గొప్పగా నటించింది.. కొత్త దర్శకుడు తీసిన సినిమాలా అనిపించలేదు. ఓ ఎమోషనల్ సీన్‌ను కిషోర్ ఎంత బాగా హ్యాండిల్ చేశారో చెప్పలేను సినిమా చూశాక మీకే (ఆడియెన్స్) తెలుస్తుంద ని అన్నారు.
నార్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మనదేశంలో 70 శాతం మందికి జీవనాధారం వ్యవసాయం.. రైతు, వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తాం.. తగిన గుర్తింపు.. ఇవ్వాలనే మంచి సబ్జెక్ట్‌తో శ్రీకారం సినిమాను తీశారు.. మా అబ్బాయి ఇంజనీర్ డాక్టర్ అని చెప్పుకుంటారు.. రైతులు వ్యవసాయం చేస్తున్నారని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని అన్నారు. సినిమా మంచి హిట్ అవ్వాలని, చిత్రయూనిట్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అన్నారు.
ప్రియాంక అరుళ్ మోహన్ మాట్లాడుతూ.. శ్రీకారం నాకు ప్రత్యేకమైన సినిమా. ఇంత మంచి సినిమాలో నేను భాగస్వామ్యం అవ్వడం గర్వంగా సంతోషంగా ఉంది.. ఈ కథకు చాలా కనెక్ట్ అయ్యాను.. నా హృదయానికి ఎంతో దగ్గరైన కథ ఇది. కేవలం వ్యవసాయం కోసమే కాదు.. అన్ని ఎమోషన్స్ ఉంటాయి.. మీరు సినిమా చూడండి.. మీకు నచ్చుతుందని పందెం కాస్తున్నాను. ఇలాంటి దర్శకుడితో పని చేయడం ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. నిర్మాతలు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పుకొచ్చారు.
ఒకే ఒక్క పోస్ట్ వేయండి..
చిత్ర దర్శకుడు కిషోర్.బి మాట్లాడుతూ.. యూట్యూబ్ నుంచి ఫీచర్ ఫిల్మ్ వరకు తీసుకొచ్చారు నిర్మాతలు. ఇప్పటికే వారి గురించి చాలా సార్లు మాట్లాడాను. అమ్మా నాన్నరామ్ గోపీ గారి గురించి మాట్లాడటం కంటే ఫీలవ్వడం ఇష్టం. కథ రాసుకోవడం ఈజీ.. నా కథను జీవితంగా మార్చేశారు. శర్వాకు థ్యాంక్స్. ఆ జీవితానికి మెట్లు కేశవులు పాత్ర.నేను ఎంతో మంది రైతులను చూశాను.. ఆ అందరినీ కేశవుల పాత్రలో దాచిపెట్టాను.. ఈ కథను సినిమా తీసేందుకు ఎంతో మంది స్ఫూర్తినిచ్చారు. డీఓపీ యువరాజ్ అన్నా.. నువ్ నాకు తోడువచ్చావ్.. మిక్కీ గారు అద్భుతైమన సంగీతం ఇచ్చారు. ఆర్ట్ డైరక్టర్, డైరెక్టర్ టీం.. ప్రొడక్షన్ టీం అందరికీ థ్యాంక్స్. డెబ్యూ డైరెక్టర్ రావాలంటే వీరందరి సహాకారం వల్లే సాధ్యమవుతుంది. నా క్యారెక్టర్ పుట్టిందే నా చుట్టూ ఉన్న మనుషుల నుంచి. ఈ సినిమా గురించి నేను చెప్పడం కంటే.. మీరు (ఆడియెన్స్) చూసిన తరువాత మాట్లాడిన మాటలే కరెక్ట్‌గా ఉంటాయి. మార్చి 11న సినిమాను చూడండి. చూసిన తరువాత సోషల్ మీడియాలో ఒకే ఒక్క పోస్ట్ వేయండి.. నచ్చితే వేయండి. న చ్చకపోయినా వేయండి అని అన్నారు.
కచ్చితంగా హిట్ అవుతుంది..
ప్రముఖ దర్శకుడు పరుశురాం మాట్లాడుతూ.. మంచి సినిమాను ఆశీర్వదించేందుకు వచ్చిన మంత్రివర్యులు కేటీఆర్ గారికి థ్యాంక్స్. నేను ఈ సినిమాను చూశాను. కొన్ని చోట్ల తెలీకుండా కన్నీళ్లు వచ్చాయి. సినిమా చేస్తూ ఎన్నో వ్యాపారాలు చేస్తే నిర్మాతలున్నారు..సినిమా అంటే వ్యామోహం ఉన్న నిర్మాతలు మాత్రం కొందరే ఉంటారు. కొత్త డైరెక్టర్ వద్ద కథ ఉందని తెలుసుకుని.. కావాల్సినంత ఫ్రీడం ఇచ్చినందుకు థ్యాంక్స్. శర్వానంద్‌ది, నాది జర్నీ ఒకేసారి ప్రారంభమైంది. ఊర్లో పొలం ఉండే ప్రతీ ఒక్కడూ గర్వించేలా చేశావ్ శర్వా. దర్శకుడు కిషోర్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా పెద్ద విజయం అవ్వాలి.. కచ్చితంగా హిట్ అవుతుంది.. అయి తీరుతుంది.. అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.
ట్యాక్స్ మినహాయింపుకు విజ్ఞప్తి
ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. డైనమిక్ లీడర్ సోసైటీలో, సోషల్ మీడియాలో క్షణాల్లో స్పందిస్తూ ఉండే కేటీఆర్ అన్నకు స్వాగతం. మీరెప్పుడూ కూడా మా ఇండస్ట్రీకి అండగా ఉన్నారు. శ్రీకారం సినిమా చూశాను వర్షం పడేటప్పుడు వచ్చే మట్టివాసనలా ఈ సినిమా ఉంటుంది.. యాక్టర్, డాక్టర్ అవ్వాలని ఎంతో మంది అనుకుంటారు కానీ ఎందుకు రైతు అవ్వాలని అనుకోవడం లేదని నేరుగా ప్రశ్నించే సినిమా ఇది. ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఓ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను.. చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చెప్పలేను కానీ.. కోట్ల మంది హృదయాలను తడుపుతుందని అన్నారు.
ఇలాంటి నిర్మాతలు ప్రపంచంలో ఎక్కడా లేరు..
సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రా ఆశాజ్యోతి వెలుగు శ్రీ కేటీఆర్ గారు.. హీరో దర్శక నిర్మాతలు అందరికీ నమస్కారాలు. నా వేషదారణ చూసి భయపడకండి.. ఇందులో అద్భుతమైన వేషమే. ఈ సినిమాలో ప్రతీ వేషం అద్భుతమైనదే. బిఫోర్ కరోనా.. ఆఫ్టర్ కరోనా అంటూ సినిమా ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ సినిమా శ్రీకారం.. కరోనా తరువాత వచ్చే సినిమాలకు ఓంకారం..అద్భుతమైన సినిమా తీయడం వేరు ఇలాంటి సినిమా తీయడం వేరు. నేను దాదాపుగా 250 సినిమాలు చేశాను.. 40 ఎకరాల భూమిని తీసుకుని పంటలు పండించి సినిమాను తీసిన నిర్మాతలు ఈ ప్రపంచంలోనే లేరు ఇది వరల్డ్ రికార్డ్ అని అన్నారు.
మట్టి మనిషిలా తీశారు..
రావు రమేష్ మాట్లాడుతూ.. నాకు పర్సనల్‌గా ఈ సినిమా స్పెషల్. గమ్యంలో శర్వానంద్‌తో కలిసి పని చేశాను.. మళ్లీ 12 ఏళ్ల తరువాత పని చేశాను.. ఆయన తండ్రి కేశవులు పాత్రను పోషించాను.. వ్యవసాయం కష్టమని అందరికీ తెలిసిందే.. లాభపడేవాళ్లున్నారు.. నష్టపోయే వాళ్లున్నారు. కథ ఏదో బరువుగా ఉంటుందని అనుకున్నాను. కానీ అటూ ఇటూ కాకుండా మిగిలిపోయిన జనరేషన్ అయిన కేశవులుకు సంబంధించిన కథే ఇది. మేకప్ లేకుండా చాలా సహజంగా తీశారు. ఈ సినిమాను మట్టి మనిషిలా తీశారు.. దర్శకుడికి థ్యాంక్స్. సినిమా కోసం 40, 50ఎకరాలు పండించి మరీ సినిమాను తీసిన నిర్మాతలకు థ్యాంక్స్ అని అన్నారు.
హ్యూమన్ ఎమోషన్స్‌తో కూడుకున్న చిత్రం.
చిత్ర నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ.. శ్రీకారం ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చినందుకు కేటీయార్‌కు థ్యాంక్స్.. మీరంటే యూత్‌కు చాలా ఇష్టం.. మీరు డైనమిక్ లీడర్.. మీరు వచ్చారంటే ఈ మూవీ రీచ్ యూత్‌లో ఎక్కువగా ఉంటుంది. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ థ్యాంక్స్. హ్యూమన్ ఎమోషన్స్‌తో కూడుకున్న చిత్రం. మన చుట్టూ జరిగే, తిరిగే క్యారెక్టర్, వాతావరణమే కనిపిస్తుంది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. మార్చి 11న ఈ మూవీ రాబోతోంది. తప్పకుండా చూడండని కోరారు.