‘విధికి విధాతకు విశ్వానికి సవాళ్లు విసరకూడదు’.. అంటూ ట్రైలర్ మొదలవుతుంది.. ‘అంచనా వేయడానికి పోలవరం డ్యామా? పట్టిసీమ తూమా? పిల్ల కాలువ’, ‘ఒక మాట నువ్వంటే శబ్దం.. అదే నేను అంటే శాసనం.. దైవ శాసనం’, ‘మీకు సమస్య వస్తే దండం పెడతారు.. నేను పిండం పెడతాను’, ‘అఖండ.. నేనే.., నేనే..నేనే’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ అద్బుతంగా ఉన్నాయి. ‘నాకు బురద అంటింది.. నాకు దురద వచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది.. గడ్డ వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే’ అంటూ శ్రీకాంత్ కూడా తన విలనిజాన్ని చూపించారు. రెండు గెటప్స్‌లో బాలకృష్ణ కనిపించి మెప్పించారు.