కొలెస్ట్రాల్‌ను కరిగించే గోరుచిక్కుడు (video)

సోమవారం, 22 జులై 2019 (10:46 IST)
గోరుచిక్కుడు కాయలో వున్న ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం.. గోరు చిక్కుడులో పోషకాలు పుష్కలంగా వున్నాయి. ఇందులోని పీచు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను పూర్తిగా కరిగిస్తుంది. గర్భిణీ మహిళలు గోరుచిక్కుడును ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా.. గర్భస్థ శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది. ప్రసవానికి తర్వాత ఏర్పడే రుగ్మతలను గోరు చిక్కుడు నయం చేస్తుంది. 
 
పీచు, కార్బొహైడ్రేడ్లు, ధాతువులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వ్యాది నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ సమస్యలకు ఇవి మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఇందులోని యాంటీ-యాక్సిడెంట్లు చర్మ సమస్యలు, మొటిమలను దూరం చేస్తాయి. 
 
ఇందులోని లో-కెలోరీలు ఒబిసిటీని దరిచేర్చవు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు రోజువారీ ఆహారంలో ఓ కప్పు మోతాదులో గోరుచిక్కుడును తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. రక్తహీనత గల వారు గోరు చిక్కుడును తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు