వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సాధించిన హీరో ఆది పినిశెట్టి.. తాజాగా నటించిన చిత్రం ''సరైనోడు'' హిట్ కావడంతో ఈ హీరో మాంచి ఊపుమీదున్నాడు. అయితే ఈ హీరోకి తెలుగులో కంటే తమిళంలో మంచి పాపులారిటీ ఉంది. తెలుగులో కూడా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న ఈ హీరోతో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు.
కేవలం హీరోగానే కాకుండా పాత్ర నచ్చితే నెగటివ్ రోల్ చేయడానికి సిద్ధపడిన ఈ హీరో రీసెంట్‌గా ''సరైనోడు'' చిత్రంలో విలన్ పాత్ర పోషించి అందరిని అలరించాడు. ఈ హీరోకి సినిమాల కంటే కూడా కుక్కలంటే చాలా ఇష్టమట. అంతేకాక తనకు ఎంతో ఇష్టమైన కుక్కకు డ్రైవింగ్ ఛాన్స్ ఇచ్చాడు.. తన సీట్‌లో వెనక్కి చేతులు పెట్టి కార్ స్టీరింగ్ తన కుక్కకు ఇచ్చి ఆ డ్రైవింగ్‌ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.