బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్‌గా గుర్తింపు పొందిన అగ్రహీరో అమిర్ ఖాన్ మూడో పెళ్లి అంశంపై స్పందించారు. ఆయన తాజాగా నటి రియా చక్రవర్తి నిర్వహిస్తున్న ఓ షోలో పాల్గొన్నారూ. ఇందులో ఆయన వైవాహిక జీవితం, మూడో పెళ్ళి తదితర అంశాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తాను విడాకులు తీసుకున్నప్పటికీ తన మాజీ భార్యలు రీనా దత్త, కిరణ్ రావుతో మంచి అనుబంధమే ఉందన్నారు. వారు ఇప్పటికీ తన కుటుంబంలో భాగమేనని చెప్పుకొచ్చారు. అలాగే వివాహ జీవితంలో రెండు సార్లు ఫెయిల్ అయిన తన నుంచి వైవాహిక సూచనలు తీసుకోకపోవడం మంచిదన్నారు.
ఈ క్రమంలో మూడో పెళ్లి ఆలోచన ఉందా అని రియా అడిగారు. దీనికి సమాధానంగా, '59 ఏళ్ల వయసులో వివాహం అంటే కష్టం. నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ప్రస్తుతం నాకెంతో ఇష్టమైన వారితో సంతోషంగా సమయాన్ని ఆస్వాదిస్తున్నా. నా ఫ్యామిలీ, పిల్లలు, మిత్రులతో రీ కనెక్ట్ అయ్యా' అని అమిర్ ఖాన్ చెప్పుకొచ్చారు
కాగా, అమిర్ ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకుని విడాకులు తీసుకున్నారు. 1986లో మొదట రీనాదత్తాను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంట 2002లో వీడిపోయింది. ఆ తర్వాత "లగాన్" మూవీకి అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసిన కిరణ్ రావుతో అమిర్‌కు పరిచయం ఏర్పడి అది పెళ్లివరకు దారితీసింది. వీరిద్దరూ 2005లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే, అనూహ్యంగా 2021లో 16 ఏళ్ల వైవాహిక బంధానికి ఈ జంట ముగింపు పలకడం గమనార్హం.