మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ కథానాయకుడిగా సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూ మాస్ హీరోగా ఎదగాలని ఏజెంట్ చేశాడు. వయస్సుకు మించిన పాత్ర వేయడంతో కథలోపంతో కూడా ఆ సినిమా ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది. అభిమానులు కూడా కథపై శ్రద్శ పెట్టమని నాగార్జునకు కూడా పలుసందర్భాలలో చెప్పడం కూడా జరిగింది. అందుకే కొంత కాలం గేప్ తీసుకున్న అఖిల్ తాజాగా కొత్త సినిమా చేయడానికి శ్రీకారం చుట్టారు. ఆ సినిమా పట్టాలెక్కింది. ఆర్భాటం లేకుండా సాదాసీదాగా షూటింగ్ ను ఆరంభించారు. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.