పారిపోయాననుకున్నారు... వాటికోసమే వెళ్లా... నటుడు విజయ్ భార్య వనిత

బుధవారం, 27 డిశెంబరు 2017 (15:27 IST)
హాస్య నటుడు విజయ్ సాయి మరణం వెనుక ఆయన భార్య వనితా రెడ్డి వున్నారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే అతడి ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె మొదటి నుంచి వాదిస్తూ వచ్చారు. ఇంతలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుంటారనే వార్తలు వచ్చేసరికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 
 
తాజాగా ఆమె పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... తను ఎక్కడికో పారిపోయానని కొందరు చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తను విజయ్ సాయి ఎలాంటివాడో నిరూపించే సాక్ష్యాల కోసమే ఇన్నాళ్లూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిపారు. 
 
ఇప్పుడు సాక్ష్యాధారాలతో వచ్చాననీ, ఇవన్నీ పోలీసుల ముందు పెట్టనున్నట్లు చెప్పారు. న్యాయవాదిని వెంటబెట్టుకుని వచ్చిన వనితారెడ్డి తనకూ విజయ్ సాయి ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి గట్టిగా వాదించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు