ఈ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల వల్ల భారీ వరదలు సంభవించాయి. వీటితో సుమారు 300లకు పైగా వరద బాధితులు మృత్యువాతపడ్డారు. అలాగే, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక సామాన్యులు ఇబ్బందిపడుతున్నారు. సామన్యులే కాదు సెలబ్రిటీలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
'మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. నిమిషాల వ్యవధిలోనే నీటిమట్టం పెరిగిపోతోంది. ఇప్పటికీ వర్షం కురుస్తోంది. మా సన్నిహితులు, బంధువుల ఇళ్లు కూడా మునిగిపోయాయి. శుక్రవారం ఉదయం వరకు మా ఇంట్లో ఉండగలిగాం. ఇప్పుడు నటి ఆశా శరత్ ఇంట్లో తల దాచుకుంటున్నాం. జీవితంలో ఎన్నడూలేని విధంగా గత రెండ్రోజులుగా చాలా దురదృష్టకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. మాకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నవారందరికీ ధన్యవాదాలు' అంటూ ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను అనన్య పోస్ట్ చేసింది.